నందమూరి హీరోలని లెక్క చేయని సునీల్‌!

నందమూరి హీరోలని లెక్క చేయని సునీల్‌!

సంక్రాంతికి బాబాయ్‌ అబ్బాయ్‌ ఇద్దరూ పందెం కోళ్లలా బాక్సాఫీస్‌ వద్ద అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతోంటే ఈ 'రభస'లోకి వెళ్లేందుకు మిగతా నిర్మాతలు జంకుతున్నారు. ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' ఇటు క్లాస్‌ని, బాలయ్య 'డిక్టేటర్‌' అటు మాస్‌ని టార్గెట్‌ చేస్తూ నువ్వా నేనా అన్నట్టు తలపడుతోంటే మీడియం, లో బడ్జెట్‌ చిత్రాల నిర్మాతలు సంక్రాంతి సీజన్‌లో స్పేస్‌ వుండదని ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఈ క్లాసు, మాసు మధ్య కామెడీకి ఖచ్చితంగా స్పేసు వుంటుందంటూ దిల్‌ రాజు తన 'కృష్ణాష్టమి'కి సంక్రాంతి ముహూర్తం నిర్ణయించాడు. సునీల్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి జోష్‌ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించాడు.

ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటోన్న సునీల్‌ ఈ చిత్రంతో ఇక పూర్తి స్థాయి హీరోగా నిలబడిపోతానని, తనని హీరోగా చూడని వారికి సైతం తనేంటో తెలిసేట్టు చేస్తానని సన్నిహితులతో చెప్పుకుంటున్నాడట. సునీల్‌ అంత నమ్మకం పెట్టుకున్న ఈ చిత్రాన్ని పోటీ లేని సమయంలో విడుదల చేస్తే ఎక్కువ లాభం వుంటుందనేది తెలిసినా కానీ చూసి, చూసి ఇద్దరు బడా నందమూరి హీరోలతో బరిలో దిగడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్థం కావడం లేదు. ఈ పోటీలో సునీల్‌ కూడా తన ఉనికి నిలుపుకుంటే ఫర్వాలేదు కానీ ఏమాత్రం తేడా జరిగినా తల పొగరు వల్లే ఈ ఫలితం వచ్చిందంటూ విమర్శకులు చీల్చి చెండాడేయరూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు