బెంగాల్‌ టైగర్‌.. మామూలు మసాలా కాదు

బెంగాల్‌ టైగర్‌.. మామూలు మసాలా కాదు

ఇంకో రెండు రోజుల్లో 'అఖిల్‌' రంగంలోకి దిగుతున్నాడు. ఆ తర్వాతి వారం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆపై వారం బాక్సాఫీస్‌ పైగి దండెత్తబోతున్నాడు 'బెంగాల్‌ టైగర్‌'. ఐతే టైం చాలానే ఉన్నప్పటికీ.. ప్రమోషన్‌ మాత్రం చాలా ముందే మొదలైపోతోంది. ఐతే నేరుగా హీరోను దించకుండా.. టైగర్‌ పక్కన రొమాన్స్‌ పండించిన భామలిద్దరితో ప్రమోషన్‌ మొదలుపెట్టించింది 'బెంగాల్‌ టైగర్‌' టీమ్‌. హీరోయిన్లు తమన్నా, రాశి ఖన్నా ఈ రోజు వెరైటీ ప్రమోషన్‌ తో అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఇద్దరూ కలిసి రెండు డోళ్లు తీసుకుని వాయిస్తూ ప్రమోషన్‌ షూరూ అన్నట్లు పోజులిచ్చారు. ఆ తర్వాత ప్రెస్‌ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా 'బెంగాల్‌ టైగర్‌'లోని రెండు పాటల ప్రోమోల్ని విడుదల చేశారు. అందులో ఒకటి ఇద్దరు హీరోయిన్లతో కలిసి రవితేజ మాస్‌ మసలా స్టెప్పులేసిన పాట. రాయే రాయే అనే పల్లవితో సాగే ఈ పాటలో తమన్నా, రాశి ఖన్నా గ్లామర్‌ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మాస్‌ ఆడియన్స్‌ ని ఉర్రూతలూగించేలా ఊర మాస్‌ స్టయిల్లో ఈ పాట తీశాడు సంపత్‌ నంది. ఇంకోటి బాంచన్‌ నీ కాల్మొక్తా.. అంటూ సాగే రవితేజ మార్కు టీజింగ్‌ సాంగ్‌. రవితేజ, తమన్నాల మీద ఫారిన్‌ లొకేషన్లో తీశారీ పాటను. ఈ నెల 27న 'బెంగాల్‌ టైగర్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు