గోపీచంద్‌ ఆమె జాతకం మార్చేస్తాడా?

గోపీచంద్‌ ఆమె జాతకం మార్చేస్తాడా?

గోపీచంద్‌ సరసన నటించిన హీరోయిన్లు ఆ తర్వాత స్టార్‌ స్టేటస్‌ సాధించడమనేది ఇప్పటికి చాలాసార్లే జరిగింది. కెరియర్‌ స్టార్టింగ్‌లో గోపీ సరసన నటించిన అనుష్క ఆపై 'హీరో' ఇమేజ్‌ వచ్చేంత పెద్ద హీరోయిన్‌ అయింది. ఆ తర్వాత రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కూడా గోపీతో నటించాక బ్రేక్‌ వచ్చి ఇప్పుడు పెద్ద సినిమాలకి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. గోపీచంద్‌తో 'జిల్‌'మనిపించిన రాశి ఖన్నా వెంట ఇండస్ట్రీ పరుగులు తీస్తోంది. ఇప్పటికే పది చిత్రాల్లో నటించిన రెజీనా కసాండ్రాకి ఇంతవరకు స్టార్‌ స్టేటస్‌ దక్కలేదు.

కొన్ని సక్సెస్‌ఫుల్‌ సినిమాల్లో నటించినా కానీ తనపై పెద్ద హీరోల దృష్టి పడలేదు. ఈ నేపథ్యంలో ఆమె గోపీచంద్‌తో 'సౌఖ్యం' సినిమాలో నటిస్తోంది. దీంతో రెజీనా జాతకం కూడా మారిపోతుందని, ఇకపై తనకి కూడా పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు వస్తాయని సెంటిమెంట్లు నమ్మే సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు. లౌక్యంతో హిట్‌ కొట్టిన గోపీచంద్‌ ఇప్పుడు మరోసారి తన టైటిల్‌లో 'ం' వుంటే హిట్టనే సెంటిమెంట్‌ మీద 'సౌఖ్యం' చేస్తున్నాడు. ఇది కానీ అతని సెంటిమెంట్‌ని నిలబడితే రెజీనా కెరియర్‌కి కూడా బూస్ట్‌ వచ్చేసినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు