సమంత దెబ్బనుంచి కోలుకున్న సిద్ధార్థ్‌

సమంత దెబ్బనుంచి కోలుకున్న సిద్ధార్థ్‌

హీరో సిద్దార్థ్‌తో చాలా కాలం ప్రేమాయణం సాగించిన సమంత అతడినే పెళ్లాడుతుందని అనుకున్నారు. కానీ అతనికి హ్యాండిచ్చి తమ బ్రేక్‌ అప్‌ గురించిన న్యూస్‌ తానే మీడియాకి లీక్‌ చేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్‌ని పలుకరించడానికి సమంత ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను పట్టించుకోలేదు. తన సినిమాలకి కాంప్లిమెంట్స్‌ ఇస్తూ, తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా సిద్ధూ సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినా కానీ మాట వరసకి కూడా అతను బదులివ్వలేదు. తాను లవ్‌లో వున్నప్పుడు కానీ, బ్రేక్‌ అప్‌ అయ్యాక కానీ సిద్ధార్థ్‌ ఈ విషయంపై సైలెంట్‌గానే వున్నాడు. సమంత తనని విడిచి పోతుందని అస్సలు ఊహించని సిద్ధార్థ్‌ ఆ దెబ్బనుంచి కోలుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా వుండే సిద్ధూ కొంతకాలం కనిపించకుండా పోయాడు.

మళ్లీ ఇప్పుడిప్పుడే మామూలు అవుతున్నట్టు కనిపిస్తోన్న సిద్ధార్థ్‌.. 'కోలుకోవడం' అంటే అది చేసిన డ్యామేజ్‌ పూర్తిగా పోయిందని కాదు.. ఇక దానికి మన జీవితాన్ని కంట్రోల్‌ చేసే అవకాశం లేకుండా చేయడాన్నే కోలుకోవడం అంటాం అంటూ పరోక్షంగా తాను మునుపటి అనుభవాలు చేసిన గాయాల నుంచి కోలుకున్న సంగతిని సిద్ధార్థ్‌ తెలియజేసాడు. తన తాజా చిత్రం 'జిల్‌ జంగ్‌ జక్‌' ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్న సిద్ధార్థ్‌ని మచ్చిక చేసుకునే ప్రయత్నాలని సమంత కూడా మానేసినట్టుంది. ఈ సినిమా గురించి ఎలాంటి ట్వీట్లు వేయకుండా సైలెంట్‌గా వుండిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు