అక్కినేని ఫాన్స్‌ చొక్కాలు చించేసుకోవచ్చు

అక్కినేని ఫాన్స్‌ చొక్కాలు చించేసుకోవచ్చు

అక్కినేని నాగార్జున ఒకానొక టైమ్‌లో చిరంజీవి, బాలయ్యలకి ధీటుగా విజయాలు సాధించి నంబర్‌వన్‌ పొజిషన్‌పై ఆశలు రేకెత్తించాడు. అయితే తన బాణీ వేరు కనుక మాస్‌ హీరోలతో సమానంగా రాణించలేక వెనుకబడ్డాడు. నాగార్జున తనయుడు నాగచైతన్య అయినా టాప్‌ ప్లేస్‌కి చేరుకుంటాడని అభిమానులు ఆశిస్తే.. అతను అసలు ప్రథమ శ్రేణి హీరోల జాబితాలోకే ఇంతవరకు చేరుకోలేదు. స్టార్‌డమ్‌పై ఆశలు కోల్పోతున్న దశలో వెండితెరపైకి రావాలని డిసైడ్‌ అయిన అఖిల్‌ మొదటి సినిమా రాకముందే చాలా క్రేజ్‌ తెచ్చుకుని ఫాన్స్‌కి నూతనోత్తేజం తెచ్చాడు. మిగతా హీరోలంతా డాన్సులు అదరగొడుతుంటే, అక్కినేని హీరోలు మాత్రం ఇది తమ జోన్‌ కాదన్నట్టు తప్పుకుపోయేవారు. కానీ అఖిల్‌ మాత్రం డాన్సుల పరంగా కూడా పూర్తిగా ట్రెయిన్‌ అయి మొదటి సినిమాలోనే మెరికలాంటి మూవ్‌మెంట్స్‌తో అదరగొట్టేస్తున్నాడు. అఖిల్‌ చిత్రంలో మొదటి పాటకి తను చేసిన డాన్స్‌ చూస్తే ఫాన్స్‌ ఎవరూ కుర్చీలో కూర్చోరని చెబుతున్నారు.

ఇక అక్కినేని, అక్కినేని పాటలో డాన్స్‌కి అయితే అభిమానులు చొక్కాలు చించేసుకుంటారట. సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందా లేదా అనే మేటరవిడుదలయ్యాక తేలుతుంది కానీ అఖిల్‌ మాత్రం తొలి పరిచయంలోనే సూపర్‌స్టార్‌ అనిపించేసుకుంటాడట. ఎంతో మంది దర్శకులని కాదని ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత తనకివ్వడంతో వినాయక్‌ పూర్తిగా అఖిల్‌ మీదే ఫోకస్‌ పెట్టి అతడిని ఓ రేంజ్‌లో చూపించాడట. ఇప్పట్నుంచి సరిగ్గా వారం రోజుల్లో అక్కినేని అభిమానుల సంబరాలకి తెర లేవనుందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు