స్వాతి ఆంటీ.. ఏంటి రియాక్షన్?

స్వాతి ఆంటీ.. ఏంటి రియాక్షన్?

‘త్రిపుర’ పోస్టర్లు వచ్చిన నాటి నుంచి స్వాతి మీద నెగెటివ్ కామెంట్లు పడుతూనే ఉన్నాయ్. మొన్నటిదాకా సన్నగా సుకుమారిలా ఉన్న స్వాతి.. ఉన్నట్లుండి ఇలా ఆంటీలా తయారయ్యిందేంటబ్బా అనుకున్నారు జనాలు. స్వాతి పనైపోయిందనడానికి ఆమె ఫిజిక్కే నిదర్శనమని.. అమ్మడు ఫిట్‌నెస్ మంత్రా పూర్తిగా పక్కనబెట్టేసిందని విమర్శలు వినిపించాయి. ఐతే తన మీద ఇలాంటి కామెంట్లు పడతాయని తనకు ముందే తెలుసని అంటోంది స్వాతి. తాను అనుకోకుండా ఏమీ లావైపోలేదని.. పాత్ర కోసమే అలా తయారయ్యానని చెబుతోంది కలర్స్ పాప.

‘‘త్రిపుర విషయంలో జనాలు ఏమనుకుంటున్నారో నేనూ విన్నా. నా లావు గురించి కామెంట్లు వినిపిస్తాయని నాకూ తెలుసు. కానీ పాత్ర కోసమే నేనలా తయారయ్యానని ఎవ్వరికీ తెలియదు. నేను పోషించేది విలేజ్ అమ్మాయి పాత్ర. పైగా అమాయకురాలు. కొంచెం బొద్దుగా ఉంటే బావుంటుందని కావాలనే ఐదారు కిలోల బరువు పెరిగా. అందుకే సినిమాలో అలా కనిపిస్తున్నా’’ అని స్వాతి చెప్పింది. అందరూ అనుకుంటున్నట్లు ‘గీతాంజలి’ సినిమాకు ‘త్రిపుర’ సీక్వెల్ కాదని.. ఇదో కొత్త కథ అని స్వాతి చెప్పింది. గీతాంజలి దర్శకుడు రాజ్ కిరణ్ రూపొందించిన ఈ సినిమాలో స్వాతికి జోడీగా నవీన్ చంద్ర నటించిన సంగతి తెలిసిందే. ‘త్రిపుర’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English