'రోజులు మారాయి' బూతు సినిమా కాదు

 'రోజులు మారాయి'   బూతు సినిమా కాదు

టాలీవుడ్‌ యువతరం దర్శకుల్లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ ఎవరంటే ముందు మారుతి పేరే చెప్పుకోవాలి. ఇప్పటిదాకా అతడి కెరీర్లో అపజయమే లేదు. డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న 'కొత్త జంట' సైతం నిర్మాతలకు లాభమే తెచ్చిపెట్టింది. ఇక తాజాగా 'భలే భలే మగాడివోయ' సినిమాతో మారుతి ఎలాంటి సక్సెస్‌ ఇచ్చాడో తెలిసిందే. దర్శకుడిగానే కాక..  నిర్మాతగానూ మారుతికి మంచి పేరుంది. ఇప్పటికే సమర్పకుడిగా, సహ నిర్మాతగా అతడి పేరు పడ్డ సినిమాలు డబుల్‌ డిజిట్లో ఉన్నాయి. కాకపోతే సమస్య ఏంటంటే.. అతడి బేనర్లో వచ్చేవన్నీ బూతు సినిమాలే అన్న పేరు పడిపోయింది. దర్శకుడిగా మొదట్లో పడ్డ బూతు ముద్రను తర్వాత తొలగించుకున్నాడు కానీ.. నిర్మాతగా మాత్రం ఆ ముద్ర చెరుపుకోలేకపోయాడు.

ఐతే ఇకపై నిర్మాతగానూ క్లీన్‌ మూవీసే తీయాలని ఫిక్సయ్యాడట మారుతి. అందులో భాగంగానే ఓ 'మంచి' సినిమా మొదలుపెడుతున్నానంటున్నాడు మారుతి. తన నిర్మాణంలో మురళీ కృష్ణ అనే కొత్త దర్శకుడితో 'రోజులు మారాయి' అనే సినిమా మొదలుపెడుతున్నాడు మారుతి. ఇది క్లీన్‌ యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అని.. ఇది నిర్మాతగా తనకు కొత్త ఇమేజ్‌ తెచ్చిపెడుతుందని మారుతి చెబుతున్నాడు. ఇందులో 'దృశ్యం' ఫేమ్‌ కృతిక జయకుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు దిల్‌ రాజుతో కలిసి మరో సినిమా కూడా నిర్మించబోతున్నాడు మారుతి. ఆ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే కూడా అతడివే. అది కూడా 'క్లీన్‌' మూవీనే అట. మొత్తానికి దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ కొత్త దారిలో ప్రయాణించబోతున్నాడు మారుతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు