కోన లేకుండా కొట్టగలడా హిట్టు?

కోన లేకుండా కొట్టగలడా హిట్టు?

రైటర్‌ కోన వెంకట్‌కో చిత్రమైన అలవాటుంది. సినిమా హిట్టయితే ఆ క్రెడిట్లో లయన్‌ షేర్‌ తనదేనంటాడు. అదే సినిమా పోయిందంటే దర్శకుడు తాను చెప్పిన మాట వినలేదని, నచ్చింది తీసుకుని ఫ్లాపిచ్చాడని అనేస్తాడు. పెద్ద దర్శకులతో పని చేసే చిత్రాలకే ఈ విధంగా చేస్తే చిన్న దర్శకుల విషయంలో చూపే అథారిటీ గురించి చెప్పాల్సిన పని లేదు. 'గీతాంజలి' అనే చిన్న చిత్రం విజయంలో కోన పాత్ర ఎంతనేది ఆ చిత్ర దర్శకుడికే తెలియాలి. కానీ అది కోన సినిమాగానే చలామణీ అయింది. ప్రస్తుతం 'శంకరాభరణం'కి కూడా తానే ఆభరణం అని అంటున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసానని టైటిల్‌ కార్డ్‌ వేసుకున్నాడు.

ఈ సినిమాకి కోన కాంట్రిబ్యూషన్‌ ఎంతనేది పక్కన పెడితే.. 'గీతాంజలి' హిట్‌ క్రెడిట్‌లో చాలా వరకు పట్టుకుపోయిన కోన లేకుండా ఆ చిత్ర దర్శకుడు ఇప్పుడు మరో సినిమా చేసాడు. ఈసారి కూడా అతను హారర్‌ కామెడీనే ఎంచుకున్నాడు. ఈ శుక్రవారం పోటీ లేకుండా వస్తున్న సదరు సినిమా 'త్రిపుర'తోను విజయవంతమైతే గీతాంజలి కూడా ఇతని ప్రతిభేనని అంటారు. ఏమాత్రం తేడా జరిగినా కానీ కోన లేడు కాబట్టి త్రిపుర తలకిందులైందనీ ప్రచారం మొదలెడతారు. మరి కోన లేకుండా కొట్టి చూపిస్తాడా హిట్టు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు