పక్కింటమ్మాయి సెక్సీ షోకి రెడీచ్‌

పక్కింటమ్మాయి సెక్సీ షోకి రెడీచ్‌

కలర్స్‌ స్వాతిగా టీవీ రంగంలో పేరు తెచ్చుకుని ఆపై సినీ రంగానికి వచ్చి కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన స్వాతి రెడ్డి ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే కనిపించింది. అల్లరి పిల్ల పాత్రల్లో ఈజీగా ఒదిగిపోయే స్వాతి గల గల మాట్లాడుతూ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. దాదాపుగా ఒకే తరహా పాత్రలు చేస్తోందనే విమర్శల నుంచి బయటపడి త్రిపుర సినిమాలో మెచ్యూర్డ్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. అయితే నాన్‌ గ్లామరస్‌ రోల్స్‌ మాత్రమే ఎంచుకుంటోన్న స్వాతి ఎక్స్‌పోజింగ్‌కి, సెక్సీ షోకి దూరమా అంటే.. అదేమీ లేదని చెప్పింది. 'ఎందుకో నాకు అన్నీ ఇలాంటి పాత్రల్నే ఆఫర్‌ చేస్తున్నారు.

వల్గర్‌గా కనిపించడం నచ్చదు కానీ సెక్సీగా లేదా గ్లామరస్‌గా కనిపించడానికి నాకు అభ్యంతరాలు లేవు. కానీ నిర్మాతలు, దర్శకులు ఎందుకో నన్ను అలా ఊహించుకోవడం లేదు. అలాంటి అవకాశం కూడా వస్తే నన్ను నేను నిరూపించుకుని అలాంటి ముద్రని చెరిపేసుకుంటాను. కానీ అలాంటి అవకాశం ఇచ్చేవాళ్లేరీ' అని స్వాతి అడుగుతోంది. సాధారణంగా ఇలా గాళ్‌ నెక్స్‌ట్‌ డోర్‌ ఇమేజ్‌ వున్న హీరోయిన్లతో ఎలాగైనా స్కిన్‌ షో చేయించాలని చూస్తారు. కానీ స్వాతి విషయంలో ఇండస్ట్రీ నుంచి అలాంటి ఆఫర్లు రాకపోవడం విచిత్రమే. ఒక్క ఛాన్సిస్తే స్వాతి ఏం చేస్తుందో చూడాలని ఇప్పుడు ఆమె మాటల్ని బట్టి అనిపిస్తోంది కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు