ఆ హీరోకి హీరోయిన్లే దిక్కు

ఆ హీరోకి హీరోయిన్లే దిక్కు

'అందాల రాక్షసి' చిత్రంలో నటించిన గడ్డం కుర్రాడు నవీన్‌ చంద్ర అందులో చాలా బాగా చేసాడు. నటుడిగా గుర్తింపు అయితే వచ్చింది కానీ సక్సెస్‌ రాలేదు. అటుపై అతను చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాపయ్యాయి. అయినా కానీ నవీన్‌కి వున్న పరిచయాల కారణంగా అవకాశాలైతే వస్తున్నాయి. ప్రస్తుతం స్వాతి సరసన త్రిపుర చిత్రంలో నటించాడు. కలర్స్‌ స్వాతి చేసిన ఈ హారర్‌ సినిమాకి పబ్లిసిటీ దంచి కొడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సినిమాలదే హవా కాబట్టి దీంతో సక్సెస్‌ అవుతానని నవీన్‌ ఆశిస్తున్నాడు. దీంతో పాటు అతని చేతిలో ఇంకో సినిమా కూడా వుంది. రీసెంట్‌గా భలే భలే మగాడివోయ్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన లావణ్య హీరోయిన్‌గా 'లక్ష్మిదేవికి ఒక లెక్కుంది' అనే సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల్లోను హీరోయిన్లు పాపులర్‌ కావడం వల్ల తనకి కూడా సక్సెస్‌ వచ్చేస్తుందని నవీన్‌ ఆశ పడుతున్నాడు. అందుకే ఇవి రెండూ రిలీజ్‌ అయ్యే వరకు ఇంకో సినిమా ఏదీ చేయనని చెబుతున్నాడు. ఈ శుక్రవారం సోలోగా విడుదలవుతోన్న త్రిపుర కూడా రాజుగారి గదిలా పెద్ద హిట్‌ అయితే నవీన్‌ ఆశలకి రెక్కలొచ్చేస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు