బ్లాక్‌బస్టర్‌కి బాబులాంటిది

బ్లాక్‌బస్టర్‌కి బాబులాంటిది

'రాజుగారి గది' చిత్రం బాక్సాఫీస్‌ని పట్టి కుదిపేస్తోన్న తీరు చూసి దీనిని తక్కువ రేటుకి కొనేసే అవకాశం వచ్చి కూడా మిస్‌ చేసుకున్న వారు దాదాపుగా ఏడ్చేస్తున్నారు. ఈ సినిమాపై ఎంత పెట్టినా వేస్టే అనుకున్న వాళ్లు చాలా లాభం పోగొట్టుకున్నామని తీరిగ్గా చింతిస్తున్నారు. ఉదాహరణకి రాజుగారి గది చిత్రాన్ని ఉత్తరాంధ్ర ఏరియాకి ముప్పయ్‌ అయిదు లక్షలకి ఇస్తామని సాయి కొర్రపాటి అక్కడి పంపిణీదారులతో మాట్లాడారట. కానీ ఎవరూ ముందుకి రాకపోవడంతో అన్నపూర్ణ ద్వారా సొంతంగా విడుదల చేసుకున్నారు. ఆ ఏరియాలో దీనికి కోటిన్నర షేర్‌ తక్కువ రాదని అంటున్నారు.

అంటే బయ్యర్లు తీసుకుని వుంటే కోటికి పైగా లాభం చేసుకునే వారన్నమాట. విశేషం ఏమిటంటే రాజుగారి గది చిత్రాన్ని నిర్మించిన ఓంకార్‌కి కూడా దీని వల్ల పెద్దగా లాభం ఏమీ రావడం లేదు. దీని రైట్స్‌ కొనేసిన సాయి కొర్రపాటి, అనిల్‌ సుంకర దీనిపై వస్తున్న లాభాల్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. దర్శకుడిగా తనకంటూ గుర్తింపు వచ్చిందని ఓంకార్‌ సంతోషంగా వున్నాడు. మరి మారుతిలా ఓంకార్‌ కూడా చిన్న సినిమాల నుంచి మీడియం బడ్జెట్‌ చిత్రాలు తీసే రేంజ్‌కి ఎదుగుతాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు