పటాస్ వల్ల ‘షేర్’ మారిపోయాడు

పటాస్ వల్ల ‘షేర్’ మారిపోయాడు

ఓ హీరో ఓ సూపర్ హిట్ సినిమాలో నటించాక.. ఆ తర్వాతి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఇది ఒకరకంగా ప్లస్, మరో రకంగా మైనస్. అంచనాలు పెరగడం వల్ల ఓపెనింగ్స్ వస్తాయి కానీ.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకుంటే అసలుకే మోసం వస్తుంది. అందుకే ‘షేర్’ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం అంటున్నాడు కళ్యాణ్ రామ్. పటాస్ కంటే ముందే ‘షేర్’ సినిమా ఓకే అయిందని.. ఐతే అనివార్య కారణాల వల్ల ‘పటాస్ ’ ముందు చేయాల్సి వచ్చిందని.. ఐతే పటాస్ అంత పెద్ద హిట్టవడంతో ‘షేర్’ కోసం చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు.

పటాస్ సినిమాలో ఎంటర్టైన్మెంటే హైలైట్ కావడంతో ‘షేర్’ కథను కూడా వినోదాత్మకంగా ఉండేలా కాస్త మార్చామని.. కామెడీ డోస్ పెంచామని, కొత్త క్యారెక్టర్లు జోడించామని అతను వెల్లడించాడు. బ్రహ్మానందం, తన మధ్య వచ్చే సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా తీర్చిదిద్దామన్నాడు. దీంతో పాటు హీరోయిన్ని కూడా మార్చామన్నాడు. మొదట హీరోయిన్ గా ఎంచుకున్న వన్యా మిశ్రా బాగానే చేసిందని.. ఐతే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగాలేదనిపించి.. తన స్థానంలో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నామని.. అన్ని సన్నివేశాలూ రీషూట్ చేశామని తెలిపాడు. ఏ అంచనాలు లేకుండా చూస్తే ‘షేర్’ కచ్చితంగా జనాలకు నచ్చుతుందని నందమూరి హీరో చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు