నా సినిమాల్ని తిట్టండి కానీ...

నా సినిమాల్ని తిట్టండి కానీ...

తన సినిమాల గురించి, తన నటన గురించి జనాలు ఏం మాట్లాడినా పర్వాలేదని.. స్పోర్టివ్ గా తీసుకుంటానని.. కానీ తన ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడితే తాను తట్టుకోలేనని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఈ మధ్య ‘షేర్’ ఆడియో ఫంక్షన్లో ఈ నందమూరి హీరో బాగా ఎమోషనల్ అవడం.. తమ ఫ్యామిలీ హీరోల్ని వేరు చేసి చూడొద్దంటూ అభిమానులకు గట్టిగా చెప్పడం తెలిసిందే. దీనిపై మరోసారి స్పందించాడు కళ్యాణ్ రామ్.
 
‘‘మేమందరం ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్లం. ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేను ఎమోషనల్ అయిపోతా. జనాలు నా సినిమాల గురించి మాట్లాడొచ్చు. నా నటనను విమర్శించవచ్చు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. నేను వాటిని గౌరవిస్తాను. కానీ నా క్యారెక్టర్ గురించి, నా ఫ్యామిలీ గురించి కామెంట్లు చేస్తే మాత్రం తట్టుకోలేదు. ఫ్యామిలీ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మా కుటుంబానికి ఉన్న గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలనుకుంటాను. ఆడియో ఫంక్షన్లో ఎమోషన్ గా మాట్లాడాల్సి వచ్చింది. నా ఫ్యామిలీకి నేనిచ్చే ఇంపార్టెన్స్ అది’’ అని కళ్యాణ్ రామ్ అన్నాడు.

తన తమ్ముడు ఎన్టీఆర్‌ తనకు వ్యక్తిగతంగా, సినిమాల పరంగా ఎంతో సపోర్టివ్‌గా ఉంటున్నాడని.. తమ్ముడితో తాను నిర్మించబోయే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని.. ఐతే తమ ఫ్యామిలీ హీరోలు కలిసి నటించే సినిమా గురించి ఇంకా ఆలోచించలేదని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు