ఐతే నందమూరి అభిమానులకు పండగే..

ఐతే నందమూరి అభిమానులకు పండగే..

ఒక విషాదం అన్నదమ్ములిద్దరినీ ఒకటి చేసింది. కుటుంబాన్ని దగ్గరికి చేర్చింది. ఇంతకుముందు ఒకరితో ఒకరు అరుదుగా కలిసే అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.. అన్నయ్య జానకిరామ్ మరణం దగ్గర్నుంచి ఒకరికి ఒకరు అన్నట్లు సాగుతున్న సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ.. ఏ ఫంక్షన్ అయినా, ఏ కార్యక్రమం అయినా.. ఒక్కటిగానే వెళ్తున్నారు, వస్తున్నారు. కిక్-2 దెబ్బకు కుదేలైన కళ్యాణ్ రామ్‌ను ఆదుకోవడానికి ఎన్టీఆర్ అన్నయ్య బేనర్లో ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లూ రచయితగా ప్రస్థానం కొనసాగించిన వక్కంతం వంశీ.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నిజానికి ‘టెంపర్’ కథతోనే దర్శకుడిగా మారాలనుకున్నాడు వక్కంతం. కానీ కుదర్లేదు. ఐతే ఇప్పుడు అదే తరహాలోనే ఓ పవర్ ఫుల్ కథతో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా తీయబోతున్నాడతను. ఐతే ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. ఇందులో కళ్యాణ్ రామ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. దీని గురించి ఇంతకుముందే రూమర్లు వినిపించాయి కానీ.. ఇప్పుడు వక్కంతం స్వయంగా ఈ విషయాన్ని సన్నిహితుల దగ్గర కన్ఫమ్ చేసినట్లు సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్రే కళ్యాణ్ రామ్ చేయబోతున్నట్లు తెలిసింది. నందమూరి హీరోలిద్దరు కలిసి తెరమీద కనిపించడం అరుదైన విషయం. కాబట్టి అభిమానులకు పండగే అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు