కళ్యాణ్‌ని పట్టించుకుంటారా?

కళ్యాణ్‌ని పట్టించుకుంటారా?

పటాస్‌తో ఈ ఏడాదిలో మొదటి బ్లాక్‌బస్టర్‌ కళ్యాణ్‌రామ్‌ సొంతమైంది. ఊహించని విధంగా ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా కళ్యాణ్‌రామ్‌కి ఊపొచ్చింది. వరుస వైఫల్యాలతో ఇక హీరోగిరీ మీద సెకండ్‌ థాట్స్‌ అవసరమని అనుకుంటున్న టైమ్‌లో వచ్చిన విజయంతో కళ్యాణ్‌రామ్‌ కెరియర్‌కి ఎక్స్‌టెన్షన్‌ దక్కింది. అయితే పటాస్‌ కేవలం సుడిలో వచ్చిన హిట్టా లేక నిజంగానే అతడిని జనం సీరియస్‌గా తీసుకుంటున్నారా అనేది షేర్‌తో తేలుతుంది. ఎందుకో ఈ చిత్రంపై విడుదలకి ముందు పెద్దగా బజ్‌ లేదు.

ఒక పెద్ద హిట్‌ కొట్టిన హీరోనుంచి వచ్చే మలి చిత్రంపై ఆసకి వుంటుంది. కానీ షేర్‌ విషయంలో ఆ ఛాయలేమీ కనిపించడం లేదు. పటాస్‌ కంటే ముందే మొదలు పెట్టిన ఈ చిత్రానికి ఆ విజయం తర్వాత కొన్ని మార్పులు కూడా చేసినట్టు వినికిడి. పటాస్‌ విజయం తర్వాత కళ్యాణ్‌రామ్‌ తన కెరియర్‌ పరంగా కేర్‌ తీసుకుంటున్నాడు. షేర్‌తో అతనికి ఎలాంటి డ్యామేజ్‌ జరగకపోతే మీడియం రేంజ్‌ హీరోగా సెటిల్‌ అయిపోయే దిశగా పావులు కదపవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు