హిట్టు బోర్డర్‌లో ఆగిపోయింది

హిట్టు బోర్డర్‌లో ఆగిపోయింది

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌తో కమర్షియల్‌ హీరోగా స్థాయి అయితే పెరిగింది కానీ మెగా మేనల్లుడికి ఇంకా కోరుకున్న ఘన విజయం మాత్రం దక్కలేదు. పిల్లా నువ్వు లేని జీవితం మాదిరిగానే 'సుబ్రమణ్యం' కూడా హిట్టు బోర్డర్‌ వరకు వచ్చి బౌండరీ దాటకుండా ఆగిపోయింది. ఈ చిత్రానికి బయ్యర్లు తొంభై శాతం మాత్రమే రికవర్‌ అయ్యారు తప్ప పెట్టుబడి రాబట్టుకోలేదు. శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో దిల్‌ రాజుకి కాస్త లాభం వచ్చినట్టే కానీ బయ్యర్ల వరకు ఇది సక్సెస్‌ఫుల్‌ సినిమా కాదు. సాయి ధరమ్‌ తేజ్‌కి ఐడెంటిటీ అయితే వచ్చేసింది కానీ తొలి హిట్టు పడలేదింకా.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'సుప్రీమ్‌'తో ఆ ముచ్చట తీర్చుకుంటాననే ధీమా అతనిలో కనిపిస్తోంది. పటాస్‌ చిత్రం మాదిరిగా ఆసాంతం వినోదంతో అనిల్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట. ఆటో జానీ మాదిరిగా సాయి ధరమ్‌ తేజ్‌ చేస్తున్న క్యాబ్‌ డ్రైవర్‌ పాత్ర క్లిక్‌ అవుతుందని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇంకా తనపై అంచనాల భారాలు, ఇమేజ్‌ తలనొప్పులు లేవు కాబట్టి ఇప్పటికి రిలాక్స్‌ అయిపోవచ్చు కానీ ముందు ముందు హిట్లు పడకపోతే జనం పట్టించుకోకపోవచ్చు కనుక కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్త వహించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు