సెన్సేషనల్ టీజర్.. దసరా సాయంత్రం 6 గంటలకు

సెన్సేషనల్ టీజర్.. దసరా సాయంత్రం 6 గంటలకు

నందమూరి అభిమానుల రచ్చకు ముహూర్తం కుదిరింది. దసరా రోజు, గురువారం సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ కొత్త సినిమా ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కాబోతోంది. గత ఏడాది ఆఖర్లో ఎన్టీఆర్ ‘టెంపర్’ లుక్, టీజర్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. కెరీర్లో ఎన్నడూ లేనంత విభిన్నమైన లుక్ తో షాకిచ్చాడు ఎన్టీఆర్. ఆ లుక్ నందమూరి అభిమానుల కళ్ల నుంచి చెరిగిపోక ముందే వాళ్లకు మరింత షాకిస్తూ సుకుమార్ సినిమా కోసం మరో విభిన్నమైన అవతారం ఎత్తాడు ఎన్టీఆర్.

తన హీరోల లుక్ విషయంలో ట్రెండీగా ఉండే సుకుమార్.. ప్రస్తుత యూత్ టేస్టుకు తగ్గట్లు యంగ్ టైగర్ ను సరికొత్త అవతారానికి మార్చాడు. మొన్నా మధ్య వచ్చిన ఫస్ట్ లుక్ ఇన్‌స్టంట్‌గా జనాలకు ఎక్కేసింది. ఇప్పుడు టీజర్‌తోనూ అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు యూనిట్ సభ్యులు. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం ఈ టీజర్ సెన్సేషనల్ గా ఉంటుందట. చాలా స్టైలిష్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ టీజర్ కట్ చేశాడని.. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని.. ఈ టీజర్ రాగానే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు