అర్రె.. మాస్ రాజా ఏసేశాడండీ

అర్రె.. మాస్ రాజా ఏసేశాడండీ

వారసత్వం ఉన్న హీరోలంతా తమ తాతల గురించో.. తండ్రుల గురించో.. మావయ్యల గురించో.. తమ బ్యాగ్రౌండ్ గురించో.. డైలాగులు వేయడం, పంచ్ లు విసరడం మామూలైపోతోంది టాలీవుడ్లో. పనిలో పనిగా అవతలి వాళ్లపై సెటైర్లు వేయడానికి కూడా వెనకాడట్లేదు. అభిమానుల్ని ఉత్తేజపరచడానికో.. ఇంకో కారణంతోనో ఇలాంటి డైలాగులు ఇరికించక తప్పట్లేదు. ఐతే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన మాస్ రాజా.. కూడా ఇప్పుడిదే స్టయిల్లో ఓ డైలాగ్ వదిలాడు. ఐతే మాస్ రాజాకు ఏ బ్యాగ్రౌండ్ లేదు కదా.. మరి దేని గురించి ఆ డైలాగ్ అంటే, ఆ బ్యాగ్రౌండ్ లేకపోవడం గురించే.

‘‘నేను సపోర్ట్ తో పైకొచ్చినవాణ్ని కాదు..  సోలోగా పైకొచ్చిన వాణ్ని’’.. ఇదీ బెంగాల్ టైగర్ ట్రైలర్లో మాస్ రాజా డైలాగ్. మాస్ రాజా ఇలా తన గురించి తాను ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్ వేసుకుంది లేదు. తొలిసారి సంపత్ నంది రవితేజతో ఆ పని చేయిస్తున్నాడు. ఈ డైలాగ్ సపోర్ట్ తో పైకొచ్చిన హీరోలకు ఎక్కడో తగులుతుందనడంలో సందేహమే లేదు. మరి దీనికి ఆ హీరోల అభిమానులు ఎలా ఫీలవుతారో చూడాలి.

సినిమాలో ఇలాంటి  పంచ్ డైలాగులకు లోటే లేనట్లుంది. ‘‘నన్ను చంపే కత్తి కానీ, గన్ను కానీ తయారవలేదు. మేక్ యన్ ఆర్డర్’’ అంటూ ఇంకో పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పాడు మాస్ రాజా. ఇక హీరోనుద్దేశించి హీరోయిన్.. ‘‘వాడు టైగర్.. బెంగాల్ టైగర్.. అది జాతీయ జంతువు. వీడు జాతి జంతువు’’ అంటుంది. మొత్తంగా మాస్ రాజా అభిమానుల్ని మెస్మరైజ్ చేయడం కోసమే వస్తున్నట్లుంది ‘బెంగాల్ టైగర్’. సినిమా రొటీన్ గానే ఉన్నా.. రవితేజ హీరోయిజం, కామెడీతో నెట్టుకొచ్చేసే ప్రయత్నమే చేస్తున్నట్లున్నాడు సంపత్ నంది.

Watch Here: Bengal Tiger Trailer

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు