ఛేంజ్‌ చేశారా... కిచిడీ చేశారా?

ఛేంజ్‌ చేశారా... కిచిడీ చేశారా?

రీమేక్‌ సినిమాల్లో మార్పు చేర్పులు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని అంతా భయపడుతుంటారు. అందుకే చాలా మంది ఒరిజినల్‌కి సీన్‌ టు సీన్‌, డైలాగ్‌ టు డైలాగ్‌ దించేస్తుంటారు. శంకర్‌లాంటి దర్శకుడు త్రీ ఇడియట్స్‌ రీమేక్‌ చేసినా కానీ ఒరిజినల్‌కి వందశాతం కట్టుబడ్డాడే తప్ప కొత్తగా తీద్దామని ప్రయత్నించలేదు. ఎందుకంటే మార్పు చేర్పుల వల్ల ఫీల్‌ అండ్‌ సోల్‌ దెబ్బ తింటుందనేది భయం.

రీమేక్‌ సినిమాలో గణనీయమైన మార్పులు చేసి సక్సెస్‌ అయిన వారిలో హరీష్‌ శంకర్‌ ఒకడు. దబంగ్‌ సినిమా కథని పూర్తిగా మార్చి పారేసి గబ్బర్‌సింగ్‌తో బెటర్‌ ప్రాడక్ట్‌ అందించాడు. ఇప్పుడు తడాఖా సినిమాకి కూడా అదే స్థాయిలో మార్పులు చేశామని చెబుతున్నారు. ఈ చిత్రం తమిళంలో హిట్టయిన వేట్టయ్‌కి రీమేక్‌. కథాపరంగా, క్యారెక్టర్స్‌ పరంగా చాలా మార్పులు జరిగాయట. మరి ఈ మార్పుల వల్ల మంచే జరిగిందో లేక మొత్తంగా కిచిడీ అయిపోయిందో రేపు ఈపాటికి తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు