సినిమా పైరసీ ఆపేదెలా?

సినిమా పైరసీ ఆపేదెలా?

తెలుగు సినిమాకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం 'సినిమా పైరసీ'. దీన్ని అరికట్టలేక, సినిమా విడుదలైన కొద్ది రోజులకే మార్కెట్‌లోకి డీవీడీలు, బ్లూ రే, సీడీలను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. తెలుగు సినీ పరిశ్రమను కూడా ఈ పైరసీ దారుణంగా దెబ్బ తీస్తోంది.

వంద రోజులు ఆడే సినిమా ఎక్కడ?
గతంలో సినిమా వచ్చిందంటే వంద రోజులు ఆడుతుందా? అని చర్చించుకునేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానరావడంలేదు. సినిమా విడుదలైన నెల, రెండు నెలలోపే టీవీల్లో ప్రత్యక్షమవుతోంది. దానికి కారణాలు అనేకం. అందులో పైరసీ కూడా ఒక కారణం. పైరసీని ఆపగలిగితే ఎక్కువ రోజులు థియేటర్‌లో సినిమా ఆడేందుకు ఆస్కారముంటుంది.

సినిమా రిలీజ్‌కి ముందే పైరసీ
'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే పైరసీకి గురయ్యింది. పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌, ఆ టైమ్‌లో పుట్టుకొచ్చిన సెంటిమెంట్‌ ఇవన్నీ ఆ సినిమాని గట్టెక్కించాయిగానీ, లేదంటే నిర్మాత ఆ పైరసీ దెబ్బకు మళ్ళీ కోలుకునేవాడు కాదు. 'బాహుబలి' సినిమా కూడా పైరసీ బారిన పడింది. ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర్నుంచి, థియేటర్‌లో సినిమా రిలీజయ్యాక జరిగే కాపీ దాకా అడుగడుగునా సినిమా పైరసీకి గురవుతుండడం దురదృష్టకరం.

పైరసీని ఆపేదెలా?
సినీ రంగానికి ప్రభుత్వం సహకరించినప్పుడే పైరసీని ఆపగలం. అది జరగనప్పుడు పైరసీని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు