నా ప‌ని అయిపోయింద‌నుకొన్నా: తాప్సి

నా ప‌ని అయిపోయింద‌నుకొన్నా:  తాప్సి

రాక‌రాక ఓ హిట్టొచ్చినందుకు ఎగిరి గంతేస్తోంది తాప్సి. హ‌మ్మ‌య్య - మూడేళ్ల నుంచీ ఇలాంటి ఓ విజ‌యం కోసం ఎదురుచూస్తున్నా. ఐయామ్ వెరీ హ్యాపీ అంటోంది. సాహ‌సం సక్సెస్ మీట్ బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ సంద‌ర్భంగా తాప్సి మాట్లాడింది. ``చందూ సార్ గురించే ఈ సినిమా ఒప్పుకొన్నా. ఆయ‌న‌తో ఓ సినిమా చేయాల‌ని ఎప్పటి నుంచో అనుకొన్నా. అది ఇలా తీరింది. నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. మూడేళ్ల నుంచి స‌రైన విజ‌యాలు లేవు. నా ప‌ని అయిపోయింది అనుకొన్నా. అలాంటి స‌మ‌యంలో ... సాహ‌సంతో ఓ హిట్టు వ‌చ్చింది..`` అని సంతోష‌ప‌డిపోతోంది తాప్సి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు