టాలీవుడ్‌కి రెండో ఇల్లు

టాలీవుడ్‌కి రెండో ఇల్లు

రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోయినా, తెలుగు సినీ పరిశ్రమ ఐక్యంగానే ఉంది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకే తెలుగు సినీ పరిశ్రమ ఉందనీ, తమ మధ్య ప్రాంతీయ బేధాలు ఎప్పటికీ ఉండదని తెలుగు సినీ ప్రముఖులు చెప్పడం అభినందనీయం. అయితే తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి చెందితే, తెలుగు సినీ రంగం భవిష్యత్తులో ఇంకా ఎంతో గొప్పగా వర్ధిల్లుతుంది. ఆ ఆలోచన ఎప్పుడో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడుగారు చేశారు.

విభజనకు ముందే విశాఖలో సినీ స్టూడియోని రామానాయుడు నిర్మించారు. అయితే సినీ రంగం విశాఖలో అభివృద్ధి చెందడానికి వీలుగా కొంచెం ఆలస్యమయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్‌ తరహాలో ఫిలిం నగర్‌ కల్చరల్‌ సొసైటీని ఏర్పాటు చూస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించింది.

విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినంతమాత్రాన తెలంగాణలోని సినీ పరిశ్రమకు ఇబ్బంది ఏమీ ఉండదు. అక్కడా ఇక్కడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. రెండు ప్రభుత్వాలూ పోటా పోటీగా తెలుగు సినీ రంగాన్ని ఆదుకుంటే, వంద కోట్లు, రెండొందల కోట్ల బడ్జెట్‌ ఏం ఖర్మ, వెయ్యి కోట్లతో సినిమాలు తీసి సక్సెస్‌లు సాధించడానికి వీలుంటుంది. వినోదపు పన్ను మినహాయింపు, సౌకర్యాల కల్పనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోటీపడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు