చరణ్‌ని ఫాలో అవ్వడంట

చరణ్‌ని ఫాలో అవ్వడంట

ఈమధ్య యువ హీరోలు కొందరు తెలుగు సినిమాలతో పాటుగా హిందీలో కూడా చేసేస్తున్నారు. రానా, రామ్‌ చరణ్‌ ఇద్దరూ బాలీవుడ్‌కి వెళ్లారు. అయితే ఇది అంత మంచి పద్ధతి కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. తెలుగులో పూర్తి స్థాయిలో నిలదొక్కుకుని, పూర్తి సమయాన్ని తెలుగు సినిమాకే కేటాయించడం వల్ల లాభం ఎక్కువ ఉంటుందని, ఇక్కడ ఓ స్థాయికి వచ్చేసిన తర్వాత వేరే భాషల గురించి ఆలోచించవచ్చునని అంటున్నారు. మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్‌లాంటి వాళ్లు పదేళ్లకి పైగా ఇక్కడ హీరోలుగా ఉన్నా ఇంతవరకు వేరే భాషల గురించి ఆలోచించలేదు. కానీ రామ్‌ చరణ్‌ మాత్రం అయిదు సినిమాలకే అటుకేసి ఓ లుక్కేస్తున్నాడు.

అయితే తాను మాత్రం బాలీవుడ్‌ గురించి ఆలోచించడం లేదని, తన పూర్తి ఫోకస్‌ తెలుగు సినిమాపైనే పెడతానని నాగార్జున తనయుడు నాగచైతన్య చెప్పాడు. తన కెరీర్‌ పరంగా స్లంప్‌లో ఉన్నప్పటికీ తడాఖాతో తిరిగి ఫామ్‌లోకి వస్తానని, మాస్‌ హీరోగా తనని ఈ చిత్రం నిలబెడుతుందని అతను ఆశిస్తున్నాడు. రేపు విడుదలయ్యే ఈ చిత్రం ఎంతవరకు అతని ఆశలు నిలబెడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు