చివరకు ‘రాధ’ కే ఓకే చెప్పాడు

చివరకు ‘రాధ’ కే ఓకే చెప్పాడు

నడి సంద్రంలో ఎటు పోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది విక్టరీ వెంకటేష్ పరిస్థితి. కెరీర్లో వరుస ఫ్లాపులు తిన్నపుడు కూడా ఆయన ఇంత డైలమాలో లేడు. లాస్ట్ ఇయర్ ‘దృశ్యం’తో సోలో హీరోగా మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నా.. ఈ ఏడాది మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ కూడా మోడరేట్ హిట్టయినా..  వెంకీ ఇంత డైలమాలో ఎందుకున్నాడో అర్థం కాని  పరిస్థితి. గత ఆరేడు నెలల్లో వెంకీ నాలుగైదు ప్రాజెక్టులు ఓకే అన్నట్లే అని.. చివరికి పక్కనబెట్టేశాడు.

తాజాగా వెంకీ తిరస్కారం అందుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి మంచి సినిమా అందించిన ఉత్సాహంలో క్రాంతి వెంకీకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. కానీ అది పట్టాలెక్కబోయే టైంలో వెంకీ నో అనేశాడు. ఇప్పుడు చివరికి తాను ఒకప్పుడు తిరస్కరించిన దర్శకుడికే  ఇప్పుడు వెంకీ ఓటేసినట్లు సమాచారం. హ్యాట్రిక్ హిట్లతో ఊపు మీదున్న మారుతితో వెంకీ ‘రాధ’ అనే సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగాక ఆగిపోయింది. ఆ తర్వాత మారుతి ‘కొత్త జంట’ ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలే లేకపోయాయి.

ఐతే ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు మారుతి. దీంతో అతడిపై వెంకీకి నమ్మకం కుదిరింది. ఒకసారి వద్దన్నామే అన్న మొహమాటమేమీ పెట్టుకోకుండా మారుతితో సంప్రదింపులు జరిపాడు వెంకీ. మారుతి కూడా ఏదీ మనసులో పెట్టుకోకుండా వెంకీకి ఫ్రెష్ గా ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు