'బ్రూస్ లీ'లో మెగాస్టార్ ను చూస్తారా?

'బ్రూస్ లీ'లో మెగాస్టార్ ను చూస్తారా?

సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ ఎట్టకేలకు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశాడు. తన కొడుకు రామ్ చరణ్ సినిమా 'బ్రూస్ లీ' కోసం మళ్లీ రంగేసుకున్నాడు. మూడు రోజుల పాటు హైటెక్ సిటీ పరిసరాల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి షూటింగులో పాల్గొన్నాడు చిరు. ఐతే ఆ షూటింగ్ చూసిన వాళ్లందరూ రెండు మూడు రోజులుగా ట్విట్టర్లో ఒకటే ఊదరగొట్టేస్తున్నారు.. చిరంజీవి లుక్ అదిరిపోయిందని.. ఆయన వయసు పది పదిహేనేళ్లు తగ్గిపోయిందని.. గ్యాంగ్ లీడర్ లుక్ మళ్లీ కనిపిస్తోందని. ఐతే మొన్నటిదాకా మనమూ చిరంజీవిని చూస్తూనే ఉన్నాం కదా. ఇంతలో ఆయన ఎలా మారిపోతారని సందేహం.

ఐతే ఈ ఫొటో చూస్తుంటే మాత్రం అందులో నడుచుకెళ్తోంది చిరంజీవే అంటే నమ్మశక్యంగా లేదు. ఇంత తక్కువ టైంలో చిరు ఎలా సన్నబడ్డాడో అర్థం కాని విషయం. కొంచెం గడ్డం పెంచి నిజంగానే 'గ్యాంగ్ లీడర్' లుక్కులోకి మారినట్లున్నాడు మెగాస్టారుడు. కంప్లీట్ లుక్ కనిపించకపోయినా మెగాస్టార్ నయా అవతారంలో దర్శనమివ్వబోతున్నాడని.. ఈ సైడ్ లుక్కుతోనే అర్థమైపోతోంది. ఈ ఫొటో చూడగానే మెగా అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. ఇక తెరమీద మెగాస్టార్ కనిపించినపుడు వారిని ఆపడం కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English