నెలకొకటి లెక్కన ఊపేసి వదిలాయి

నెలకొకటి లెక్కన ఊపేసి వదిలాయి

ఓవర్సీస్‌లో తెలుగు సినిమా మార్కెట్‌ ఇప్పటికీ ఎదిగే స్టేజ్‌లోనే వుంది. ఒక్క యుఎస్‌ తప్పించి మరెక్కడా తెలుగు సినిమాలు చెప్పుకోతగ్గ స్థాయిలో ఆడవు. మన సినిమాలతో పోలిస్తే తమిళ చిత్రాలకే చాలా దేశాల్లో డిమాండ్‌ వుంది. అయితే కేవలం యుఎస్‌లోనే తెలుగు సినిమా రేంజ్‌ చాలా ఎత్తుకి ఎదిగిపోయింది. జులైతో మొదలు పెట్టి సెప్టెంబర్‌ వరకు యుఎస్‌లో తెలుగు సినిమాలు చేసిన బిజినెస్‌ చూసి బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు సైతం అవాక్కయ్యారు. బాహుబలి ఆరున్నర మిలియన్‌ డాలర్లకి పైగా అక్కడ వసూలు చేస్తే, శ్రీమంతుడికి దాదాపు మూడు మిలియన్‌ డాలర్లు వచ్చాయి. కేవలం యాభై లక్షలు పెట్టి కొన్న భలే భలే మగాడివోయ్‌ చిత్రానికి 1.3 మిలియన్‌ డాలర్లు రావడంతో తెలుగు సినిమాకి ఇక్కడ ఎంత క్రేజ్‌ వుందనేది అర్థమవుతోంది. అయితే వీటిని చూసి అన్ని సినిమాలనీ ఇలాగే కొనేస్తామంటే కుదరదు.

నిజంగా బాగున్నాయని అందరూ మెచ్చుకున్న చిత్రాలు ఇక్కడ ఆదరణ పొందుతున్నాయి. గతంలో మాదిరిగా హిట్టుకీ హిట్టుకీ మధ్య దూరం చాలా వుండాలనేదేమీ లేదు. ఇప్పుడు బాగున్నాయంటే రెండు సినిమాల మధ్య గ్యాప్‌ అంతగా లేకపోయినా వచ్చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇంతవరకు అయిదు సినిమాలు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరడంతో ఇక ఇది చాలా రొటీన్‌ విషయం అయిపోయింది. ఇకపై వచ్చే ప్రతి పెద్ద సినిమాకీ మినిమమ్‌ మిలియన్‌ డాలర్లు రాకపోతే పని జరగదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు