ఆకాశానికి నిచ్చెనలేస్తున్న మారుతి

ఆకాశానికి నిచ్చెనలేస్తున్న మారుతి

వరుసగా రెండు హిట్లు కొట్టగానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుందని.. ఆయన ఓకే అంటే కథ రెడీ చేసేస్తానని ఘనంగా ప్రకటించేశాడు మారుతి. కానీ ఈరోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాలతో అతను తెచ్చుకున్న ఇమేజ్ ప్రకారం చూస్తే పవన్ దాకా ఎందుకు ఓ మీడియం రేంజి హీరో కూడా అతడితో  సినిమా చేయడానికి భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఆ ఇమేజ్ ను కొంచెం కొంచెంగా చెరుపుకుంటూ వచ్చేశాడు మారుతి. అతడి కొత్త సినిమా ‘భలే భలే మగాడివోయ్’ క్లీన్ ఎంటర్టైనర్ అనిపించుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. దీంతో ఇక స్టార్ హీరోలతో చేయడానికి ఇక తనకు అడ్డేముంది అనుకుంటున్నాడు మారుతి. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు చేయాలనుకుంటున్నానని ప్రకటించాడు.

మహేష్, పవన్ ల కోసం తన దగ్గర కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని.. వాళ్లు ఓకే అనడం ఆలస్యం సినిమాలు మొదలుపెట్టేస్తానని చెబుతున్నాడు మారుతి. ఐతే నాని లాంటి మీడియం రేంజి హీరోను డీల్ చేసిన మారుతి.. ఒక్కసారిగా పవన్, మహేష్ లాంటి బడా స్టార్లతో సినిమాలు కోరుకోవడమంటే ఆకాశానికి నిచ్చెనలేస్తున్నట్లే. ముందు అతను మాస్ ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరోను డీల్ చేయాలి. అల్లు అర్జున్ కు మారుతి చాలా దగ్గరి వాడన్న సంగతి తెలిసిందే. దశాబ్దం నుంచి అల్లు కుటుంబంతో మారుతికి అనుబంధముంది. అలాంటిది బన్నీతో సినిమా ఓకే చేయించుకోవడమే కుదరట్లేదు. ‘భలే భలే మగాడివోయ్’తో మారుతి కొన్ని మెట్లు పైకెక్కాడని.. ఇంకా కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉందని అన్నాడు అరవింద్. బన్నీతో చేయడానికే గ్రీన్ సిగ్నల్ రాలేదంటే.. ఇక పవన్, మహేష్ లతో అంటే మారుతతి చాలా ఏళ్లు ఎదురు చూడాల్సిందేనన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు