చిరు పీకే నా.. ఇది టూమచ్ !

చిరు పీకే నా.. ఇది టూమచ్ !

సినీ రంగంలో సత్తా చాటేందుకు, తన స్టామినా ప్రదర్శించేందుకు.. మెగాస్టార్ చిరంజీవి రెడీగానే ఉన్నారు. రీఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని, ఫ్యాన్స్ ని అలరించాలని కోరుకుంటున్న చిరంజీవి, అందుకు తగ్గ స్టోరీ కోసం ఏడాది పైగానే ఎదురుచూస్తున్నారు. మంచి స్టోరీతో వస్తే ఆఫర్ ఇస్తా అంటూ.. ఈ మధ్య రైటర్ కం డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారాయన. విజయేంద్రప్రసాద్ లాంటి రైటర్లయితే తమ వల్ల కాదని చేతులెత్తశారు. కొంతమంది చిరుకు స్టోరీ లైన్  వినిపించినా ఆయన  టీం సంతృప్తి చెందలేదు. పూరి చెప్పిన ఆటోజానీకి ఫస్ట్ పార్ట్ వరకే ఓకే చేశారు. వినాయక్ తో చర్చలు జరిపినా. వాటి సంగతి ఏమైందో తెలీదు. దీంతో చిరు దగ్గర ఓ ప్రపోజల్ పెట్టారట సన్నిహితులు. అమీర్ ఖాన్ హీరోగా వచ్చి.. ఇండియాకే బిగ్గెస్ట్ హిట్ అయిన పీకే చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని అడిగారట. ఆ మూవీ చూడాల్సిందిగా కోరారట. దీనిపై ఆలోచనలు జరుగుతున్నట్లు టాక్. ఈ కేరక్టర్ కి ఏజ్ ఫ్యాక్టర్ తో పెద్దగా పని ఉండదు కానీ.. మాస్ హీరో చిరు ఓ గ్రహాంతరవాసిగా చేయడమా ? దానికితోడు ఇంతటి సాఫ్ట్ స్టోరీ ఆయనకు యాప్ట్ అవుతుందా ? ఇప్పటికే దేశం మొత్తం చూసేసిన సినిమాని మళ్లీ తీస్తే కిక్ ఏముంటుంది ? ఇవన్నీ ప్రశ్నలే. జవాబు మాత్రం మెగాక్యాంప్ నుంచే రావాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు