మారుతి 'రొమాన్స్' కు కష్టకాలం!

మారుతి 'రొమాన్స్' కు కష్టకాలం!

ప్రస్తుతం చిన్న సినిమా ల పాలిట ఒక ధైవస్వరూపం దాసరి మారుతి. సినిమాను లో బడ్జెట్ లో చుట్టేయడం ఎలాగో నేర్పడంతోపాటు వాటిలో మసాలా దట్టించడం గురించి కూడా మారుతి చాలా మందికి పాఠాలు నేర్పాడు!  మారుతి స్ఫూర్తితో అలాంటి కథలతో వారానికి ఒకటీ రెండు సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి ఇంతటి స్ఫూర్తిమంతుడైన మారుతి సినిమాకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఇతడు "ఈ రోజుల్లో'' అనే బ్రాండ్ తో రూపొందించిన 'రొమాన్స్' సినిమాకు కష్టకాలం వచ్చింది! ఈ సినిమాకు విడుదలకు సర్వం సిద్ధమైన తరుణంలో థియేటర్లు దొరకడం లేదని వినికిడి.

వచ్చే రెండు మూడు వారాల్లో పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన రెండు సినిమాలు వరసలో ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. అలాంటి బాధిత చిన్న సినిమాల్లో రొమాన్స్ కూడా ఒకటి! ఈ సినిమాతో పాటు అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్ హీరోగా నటిస్తున్న 'అడ్డా' తదితర సినిమాలు కూడా ఈ బాధిత జాబితాలో ఉన్నాయి. వీటన్నింటి మాటేమిటో కానీ... మారుతి సినిమాకు థియేటర్ల దొరకకపోవడమే ఒక సంచలన విషయం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు