విడాకుల కోసం సుదీప్ భారీ డీల్

విడాకుల కోసం సుదీప్ భారీ డీల్

విదేశాల్లో విడాకుల డీల్స్ చాలా భారీగా ఉంటాయి. సెలబ్రెటీలు వందల కోట్లిచ్చి విడాకుల సెటిల్మెంట్లు చేసుకుంటుంటారు. మనదగ్గర ఆ స్థాయిలో కాకున్నా కొందరు సెలబ్రెటీలు భారీ మొత్తాలకు డైవోర్స్ సెటిల్మెంట్లు చేసుకుంటుంటారు. ఆ మధ్య నయనతారతో పెళ్లికి రెడీ అవుతూ తన  భార్య రమా లత్ నుంచి విడాకుల కోసం భారీ మొత్తమే సమర్పించుకున్నాడు ప్రభుదేవా. ఇప్పుడు అలాంటి మరో డీల్ కన్నడ నాట సంచలనం రేపుతోంది. కన్నడ సూపర్ స్టార్, ఈగ సినిమాతో తెలుగువారికీ చేరువైన సుదీప్.. తన భార్య ప్రియ రాధాకృష్ణన్ నుంచి విడాకులు తీసుకుంటున్నాడు. ఇందుకోసం అతను భరణం కింద రూ.19 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరూ పరస్పర అంగీకారంతో శుక్రవారం విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరికీ అంగీకారమే కాబట్టి త్వరలోనే విడాకులు మంజూరయ్యే అవకాశముంది. ఐతే సుదీప్ కు వేరే అఫైర్లు కూడా ఏమీ లేవు. పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టేందుకు, తనతో తాను గడపడం కోసం విడాకులు తీసుకుంటున్నట్లు సుదీప్ ట్విట్టర్లో వెల్లడించాడు. మిగతా వాళ్లలాగా అంతా గోప్యంగా చేయకుండా.. అభిమానులకు విషయమంతా పూసగుచ్చినట్లు వివరించి మరీ విడాకులు తీసుకుంటున్నాడు సుదీప్. ఈ విషయాన్ని మరీ అతిగా ప్రచారం చేయొద్దని.. తన కుటుంబం తనకు ఇన్నాళ్లు పూర్తి సహకారం అందించిందని.. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు సుదీప్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు