మళ్లీ సీక్వెల్ తీస్తానంటున్న రాజమౌళి

మళ్లీ సీక్వెల్ తీస్తానంటున్న రాజమౌళి

టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ ఆడిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. చిన్న సినిమాల నుంచి మెగా హీరోల వరకూ ఎవరికీ సీక్వెల్‌గా తీసిన సినిమా కిక్ ఇవ్వలేకపోయింది. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం రెండో సీక్వెల్‌కి రెడీ అయిపోతున్నాడు. బాహుబలిని రెండుభాగాలుగా తీస్తున్నట్లు ముందుగానే చెప్పాడు. బాహుబలి ది బిగినింగ్ మూవీ అయితే... జక్కన్న కూడా ఊహించని విజయాన్ని అందుకుంది. 2016లో రిలీజ్ కానున్న సెకండ్ పార్ట్‌పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ సినీ చరిత్రలో వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ అందుకోనున్న తొలి మూవీ ఇదే అవుతుందనే అంచనాలున్నాయి. దీని తర్వాత జక్కన్న ఏ సినిమా తీస్తాడా అనే సస్పెన్స్ ఉంది ఇన్నాళ్లూ.

మహేష్, ఎన్టీఆర్‌లు రాజమౌళితో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి టైంలో.. రాజమౌళి ఈగ2 తీయబోతున్నాడంటూ చెప్పేశాడు నాని. ఇప్పటికే బాహుబలి ది కంక్లూజన్ మెగా సక్సెస్ కావడం ఖాయమని తేలిపోయింది. ఆ తర్వాత రాబోయే ఈగకు ఈ స్థాయి రిజల్ట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రెండింటి సక్సెస్ తర్వాత... సీక్వెల్స్ తీసి అద్భుత ఫలితాలు సాధించిన తొలి డైరెక్టర్‌గా తెలుగు సినిమా చరిత్రలో రాజమౌళి పేరు సువర్ణాక్షరాలతో రాసేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు