తంబీకి హ్యాండిచ్చిన డర్టీ భామ

తంబీకి హ్యాండిచ్చిన డర్టీ భామ

సిల్కుస్మిత క్యారెక్టర్‌లో హొయలు పోయి సౌత్‌లో ఫేమస్‌ అయిపోయింది విద్యాబాలన్‌. తెలుగమ్మాయి సిల్కు స్మిత జీవితకథలో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. అసలు సిల్కు బోల్డ్‌ అనుకుంటే విద్యా డబుల్‌ బోల్డ్‌ అన్న సంగతి జనాలకు తెలిసొచ్చింది. ఒకే ఒక్క డర్టీపిక్చర్‌తో బాలన్‌ ఎవరో తంబీలకు, తెలుగువారికి తెలిసిపోయింది. అందుకే హీరో ధనుష్‌ సరసన బాలన్‌ నటిస్తోంది అనగానే అందరిలోనూ ఒకటే క్యూరియాసిటీ. ఓ స్పైసీగాళ్‌తో బక్కపలచని ధనుష్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో అన్న సందేహాలొచ్చాయి. మూవీలో ఇంకేదో మ్యాజిక్‌ చేయాలనుకుంటేనే ఇలాంటి రేర్‌ కాంబినేషన్‌ సెట్‌ చేసే ప్లాన్‌ వేశారనుకున్నారంతా.

కానీ ఆదిలోనే హంసపాదు. బాలన్‌ హ్యాండిచ్చింది. నావల్ల కాదు. కాల్షీట్లు ఇవ్వలేను అని చేతులెత్తేసింది. దాంతో దర్శకుడు దురై సెంథిల్‌ వేరొక హాటీ కోసం టార్చ్‌ వేసి వెతుకుతున్నాడు. చెన్నయ్‌, ముంబై, హైదరాబాద్‌ కాదేదీ ఎంపికలకు అనర్హం. డర్టీ భామ అంత సెక్సీగా కనిపిస్తే చాలు వెంటనే ఒడిసి పట్టుకునేట్టే కనిపిస్తున్నారు. ఆ ఛాన్స్‌ ఎవరికి దక్కనుందో? అనుష్క, తమన్నా,  శ్రీయ వీళ్లకు లేదా ఛాన్స్‌?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు