పాటలు బాగున్నాయ్‌ నానా కళ్యాణ్‌

పాటలు బాగున్నాయ్‌ నానా కళ్యాణ్‌

ఎట్టకేలకు కొరియర్ బాయ్ కళ్యాణ్ ని.. థియేటర్లలో డెలివరీ ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా పూర్తి చేసుకుంది. సాంగ్స్ టీజర్స్‌ని లాంఛ్ చేశారు కూడా. పాటలన్నీ సూపర్‌గా ఉన్నాయనే టాక్ వస్తోంది. మొదట మందుపాటతో మొదలెట్టి... మాంచి స్టెప్పులేశాడు. సిగ్గు బాగుందే అంటూ యామీ గౌతమ్ తో ఆడిపాడాడు నితిన్. ఆ తర్వాత బంగారమా సింగారమా.. అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ విజువలైజేషన్ అయితే సూపర్‌గా ఉంది.

మొత్తం నాలుగుపాటలున్న ఈ ఆల్బమ్... మాయా ఏంచేశావే మాయా అంటూ పాడే పాటతో పూర్తవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. తన పేరు కళ్యాణ్ అని.. అందరూ పీకే అని పిలుస్తారని, పీకే అంటే పని లేని కళ్యాణ్ అంటూ వేసిన జోక్ బాగానే పేలింది. ప్రేమ్ సాయి డైరెక్షన్ లో వస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్.. ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ ప్రొడ్యూసర్ కాగా.. అనూప్ రూబెన్స్, కార్తీక్ మ్యూజిక్ అందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు