ఈ ఫ్లాప్‌ స్టార్స్‌ ఇద్దరికీ అదే దిక్కు

ఈ ఫ్లాప్‌ స్టార్స్‌ ఇద్దరికీ అదే దిక్కు

గోపీచంద్‌ విలన్‌ పాత్రల నుంచి హీరోగా మారిన తర్వాత మాస్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తన సక్సెస్‌ గ్రాఫ్‌ని మెయింటైన్‌ చేయడంలో అతను తడబడ్డాడు. మూస సినిమాలతో పరాజయాలు ఎదురు కావడంతో బాగా వెనుక బడ్డాడు. అతని గత చిత్రం మొగుడు తర్వాత చాలా గ్యాప్‌ కూడా వచ్చేసింది. త్వరలో అతని సాహసం చిత్రం విడుదల కానుంది. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది.

మరి గోపీ ఎదురు చూపులని ఈ చిత్రం తీర్చేస్తుందో లేదో చూడాలి. అతనికే కాకుండా ఈ సినిమా విజయం హీరోయిన్‌ తాప్సీకి కూడా చాలా కీలకం. ఇప్పటికే ఆమెని ఐరెన్‌లెగ్‌ అనేస్తున్నారు కాబట్టి ఈ విజయం అందుకోకపోతే ఆమెకి కొత్తగా అవకాశాలు దక్కడం కూడా కష్టమైపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు