హన్సిక తల్లి పదేళ్లకొచ్చింది!

హన్సిక తల్లి పదేళ్లకొచ్చింది!

హెడ్ లైన్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. హన్సిక తల్లి ఎప్పుడూ ఆమెతోనే ఉంటుంది కదా, పదేళ్లకు రావడమేమిటి అంటూ కన్ ఫ్యూజ్ కావద్దు. మనం మాట్లాడుకుంటోంది రియల్ మమ్మీ గురించి కాదు, రీల్ మమ్మీ గురించి. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ చేస్తోన్న మల్టీస్టారర్ చిత్రంలో విష్ణు సరసన నటిస్తోంది హన్సిక. ఇందులో మోహన్ బాబుకు జంటగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తోంది. హన్సిక రవీనా కూతురిగా చేస్తోంది. వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లుగా నటించడం ఇది రెండోసారట. హన్సిక చిన్న వయసులోనే మేకప్ వేసిన సంగతి తెలుసు కదా!
 
అప్పట్లో ఆమె జాగో అనే ఓ హిందీ చిత్రంలో నటించింది. అందులో హన్సిక తల్లిగా రవీనాయే నటించింది. ఆ సినిమా వచ్చి ఇప్పటికి పదేళ్లయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరం తల్లీకూతుళ్లుగా చేస్తున్నారు. ఈ విషయం గురించి అడిగితే హన్సిక చాలా ఎగ్జయిటవుతోంది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీటవుతుందని అసలు ఊహిస్తామా చెప్పండి అంటూ చిన్నపిల్లలా సంబరపడిపోతోంది. అదీ సంగతి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు