యుటివి వారు ఇప్పుడు ఫీలవుతున్నారేమో!!

యుటివి వారు ఇప్పుడు ఫీలవుతున్నారేమో!!

అదంతేనండీ.. కొన్ని మంచి సినిమాలు ముందుగా ఎవరో చేస్తారని అనుకుంటాం. కాని చివరకు సినిమా తెర మీద పడేసరికి హీరో నుండి నిర్మాత వరకు అందరూ మారిపోతారు. సర్లేండి.. ఏదో డైరక్టర్లే కథలు రాస్తున్నారు కాబట్టి, ఈ మధ్యన వాళ్ళన్నా ఫిక్సుడుగా ఉంటున్నారు. లేకపోతే ఒకానొక కాలంలో స్టూడియోల హయాం నడిచినపుడు, ఆఖరి క్షణంలో డైరక్టర్‌ను మార్చేసిన న్యూస్‌లు కూడా అనేకం వినేవాళ్ళం. ఇక శ్రీమంతుడు సినిమాను కొరటాల శివ డైరక్షన్‌లో ప్రొడ్యూస్‌ చేయాల్సింది ఎవరో తెలుసా? యుటివి వారు.

విద్యాబాలన్‌ మొగుడు సిద్దార్థ్ రాయ్‌ కపూర్‌ నిర్మాతగా చేయడానికి హైదరాబాద్‌ వచ్చి మహేష్‌ను, కొరటాల శివను కలసి, ఆ తరువాత 'ఉలవచారు' రెస్టారెంట్‌లో డిన్నర్‌ కూడా చేసి వెళ్ళాడు. కాని ఏం లాభం.. చివరకు ఏదో తేడా వచ్చి వదిలేశారు. వారికి స్క్రిప్టు నచ్చలేదని అప్పట్లో టాక్‌. ఇప్పుడేమో మైత్రి వారు సినిమాను తీసి, మహేష్‌కు వాటా ఇచ్చి, చివరకు ఈరోస్‌ సంస్థకు అమ్మేశారు. ఎగ్జాక్టుగా యుటివి వారి కాంపిటీటర్‌ చేతిలో పెట్టినట్లయ్యింది. మరి యుటివి వారు ఎంత ఫీలవుతున్నారో ఏంటో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు