పవన్‌కళ్యాణ్‌ 'గబ్బర్‌సింగ్‌' ఎందుకొదిలేశాడు?

పవన్‌కళ్యాణ్‌ 'గబ్బర్‌సింగ్‌' ఎందుకొదిలేశాడు?

గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ని నిర్మిద్దామని అనుకున్న పవన్‌కళ్యాణ్‌ ఆ చిత్రాన్ని ఎందుకని శరత్‌ మరార్‌ ప్రొడక్షన్‌కి షిఫ్ట్‌ చేసినట్టు? గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ కూడా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లోనే చేద్దామని పవన్‌ అనుకున్నాడట. అయితే హరీష్‌కి ఇప్పుడున్న కమిట్‌మెంట్స్‌ వల్ల వచ్చే ఏడాది వరకు ఫ్రీగా ఉండడట.

అంత కాలం ఆ ప్రాజెక్ట్‌ డిలే చేయడం ఇష్టం లేని పవన్‌ ఆ కథని రచ్చ దర్శకుడు సంపత్‌ నంది చేతిలో పెట్టాడు. సంపత్‌ తయారు చేసిన కథ తనకి నచ్చకపోవడంతో అతనికి ఈ కథ ఇచ్చి దీనికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించాడు. అలా గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ చేతులు మారింది.

తన ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేయడానికి క్రేజీ డైరెక్టర్‌ మస్ట్‌గా ఉండాలని భావిస్తున్న పవన్‌ తన ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్‌కే ఆ బాధ్యత అప్పగించాడు. అలా 'కోబలి' సినిమాతో పవన్‌ నిర్మాత కాబోతున్నాడు. ఒకవేళ హరీష్‌ శంకర్‌ ఫ్రీగా ఉండి ఉంటే గబ్బర్‌సింగ్‌ 2తోనే పవన్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ అయి ఉండేది.