నార్వే, స్వీడన్ వెళ్లనున్న'శివమ్'

 నార్వే, స్వీడన్ వెళ్లనున్న'శివమ్'

 జీవా, కార్తీక, పియా బాజ్ పాయ్ నటించిన 'రంగం' చిత్రం గుర్తుందా? ఆ చిత్రం మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లో తీసిన పాటలు చాలా కనువిందుగా ఉంటాయి.. ఆ అరుదైన లొకేషన్స్ లో రామ్ 'శివమ్' పాటల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాలో పాటలకు మంచి స్కోప్ ఉన్నందున, వాటి చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ నెల 4న ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. దీంతో పాటలు మినహా  టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. పాటల చిత్రీకరణను ఈ నెల 18న ఆరంభించనున్నారు.

ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - ''18 నుంచి ఈ నెలాఖరు వరకూ పాటలను చిత్రీకరిస్తాం. నార్వే, స్వీడన్ లలో 'రంగం' షూటింగ్ జరిగిన ప్రాంతాల్లో ఈ పాటలను షూట్ చేస్తాం. లొకేషన్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయి. ఈ షెడ్యూల్ లో మూడు పాటలు చిత్రీకరిస్తాం. ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు'' అని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు