'ఆఫ్గాన్ జిలేబి' డిసప్పాయింట్ చేసిందే

'ఆఫ్గాన్ జిలేబి' డిసప్పాయింట్ చేసిందే

'జిలేబీ' పేరు వింటే చాలు ఒక్కసారిగా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ జిలేబీకి కత్రినా కైఫ్ తోడైతే ఇది ఎంత హాట్ గా వుంటుందోనని చూడటానికి అందరూ ఆసక్తి కనబరుస్తారు. కానీ ఇక్కడే దెబ్బయిపోతున్నారు సినీ అభిమానులు. బాలీవుడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లో 'ఫాంటమ్' ఒకటి. ఈ సినిమాకి సంబంధించిన 'ఆఫ్గాన్ జిలేబి' అనే పాటను డైరెక్టర్ కబీర్ ఖాన్ తన ట్విట్టర్ ద్వార రిలీజ్ చేశారు.

కత్రినా 'ఆఫ్గాన్ జిలేబి' అనగానే ఈ పాటలో ఏ రెంజులో అందాలను అరబోసిందోనని చూడటానికి సినీ ప్రేక్షకులు క్యూ కట్టారు. కానీ తీరా వీడియో చూశాక నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ సాంగ్ చిక్నీ ఛమేలీ, మాషా అల్లా సాంగ్స్ లాగా కత్రినా తన అందలాతో మతులు పోగొడుతుంది అనుకుంటే అర్థం కానీ లిరిక్స్ తో, హడావుడి గా వున్న ఈ పాటను కుర్రకారు ఎంజాయ్‌ చెయ్యలేకపోతున్నారు మరి. 'భజరంగీ భాయీ జాన్' దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కాబోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English