తులసి అనామిక.. సంతోషం సగం బలం

తులసి అనామిక.. సంతోషం సగం బలం

వెంకటేష్ అభిమానులకు గుడ్‌న్యూస్. గోపాల గోపాల చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీ మరో చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. మంచి సబ్జెక్టు కోసం ఇన్ని రోజులు వేచి చూసిన వెంకటేష్, ఓనమాలు, ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు లాంటి చిత్రాలు తీసి మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట.

సాయి మాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రం మొత్తం కుటుంబ భావోద్వేగాలు మధ్య నడుస్తుందట. సినిమాకు సంతోషం సగం బలం అనే పేరును పెట్టాలని అనుకుంట్టున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రారంభం చేసి కంటిన్యూ షెడ్యూల్లో పూర్తి చేసి రిలీజ్ చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడట. ఇక మారుతి సినిమా కోసం ఇచ్చిన డేట్స్ మన అనామిక నయనతార ఇప్పుడు ఈ సినిమాకు ఇచ్చేస్తోంది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English