మహేష్‌ కూతురు.. కంట్రోలే లేదబ్బా

మహేష్‌ కూతురు.. కంట్రోలే లేదబ్బా

నిన్ని జరిగిన మా టివి వారి సిని'మా' అవార్డ్స్‌లో ఎన్నో తళుకులు, మెరుపులు, రచ్చ రచ్చలు. అందులో ముఖ్యంగా స్టేజ్‌ మీద ఉన్నంతసేపూ చాలామంది సెలబ్రిటీలు దుమ్ము దులిపేస్తే.. అందరికంటే ఎక్కువగా అరిపించేసింది మాత్రం రెండు సంవత్సరాల సితార. అవును, మహేష్‌ బాబు కూతురే. ఈ కార్యక్రమంలో తన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణను ఫెలిసిటేట్‌ చేయడంతో.. ఫ్యామిలీ సమేతంగా వచ్చేశాడు మహేష్‌.

ఇక స్టేజీ మీద ఏదైనా మహేష్‌ బాబు సాంగ్‌ ప్లే అవుతుంటే చాలు.. వెంటనే సితార స్టెప్పులు వేసేస్తోంది. అసలు ఆమె ఆనందానికి అవధులు అనేవే లేవు. ఫుల్‌గా డ్యాన్స్‌ వేసేస్తోంది అంతే. కంట్రోల్‌ లేకుండా ఈ రేంజులో డ్యాన్సులు బయటనే ఈ రేంజులో డ్యాన్సు వస్తే, ఇక ఇంట్లో సితార టాపు లేపేశేలా ఉందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు