గబ్బర్‌సింగ్‌లా వర్కవుట్‌ అవుద్దా?

గబ్బర్‌సింగ్‌లా వర్కవుట్‌ అవుద్దా?

తమిళ రీమేక్స్‌, మలయాళ రీమేక్స్‌ తెలుగులో బాగా ఆడడం తరచుగా జరుగుతుంటుంది. అయితే హిందీ సినిమాల రీమేక్స్‌ మాత్రం చాలా అరుదుగా ఇక్కడ క్లిక్‌ అవుతుంటాయి. మన ప్రధాన నగరాల్లో హిందీ సినిమాలకి తెలుగు ప్రేక్షకుల తరఫున ఆదరణ బాగుండడం, యువతరం డివిడిల్లో అయినా హిందీ సినిమాలు ముందే చూసేయడం వల్ల ఇక్కడ హిందీ రీమేక్స్‌ చాలా రేర్‌గా క్లిక్‌ అవుతుంటాయి. ఒరిజినల్‌కి కట్టుబడి చేసేసినట్టయితే ఎక్కువ సార్లు పరాజయం పాలవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, గబ్బర్‌సింగ్‌లాంటివి మాత్రం ఇక్కడి ప్రేక్షకుల్ని కూడా మెప్పించి హిట్టవుతుంటాయి.

ఈమధ్య కాలంలో పవన్‌ నటించిన తీన్‌మార్‌, వెంకీ చేసిన బాడీగార్డ్‌ (మలయాళ రీమేక్‌ అయినా ముందే బాలీవుడ్‌లో రీమేక్‌ అయిపోయింది), సిద్ధార్థ్‌ నటించిన జబర్దస్త్‌ ఇక్కడ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో శేఖర్‌ కమ్ముల తీస్తున్న 'అనామిక' ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. హిందీలో ఘన విజయం సాధించిన కహానీకి రీమేక్‌ అయిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు