తాప్సీ పెళ్లి ముచ్చట్లు

తాప్సీ పెళ్లి ముచ్చట్లు

షో బిజ్‌లో కొన్నేళ్లు గడిపితే ఏ కథానాయిక అయినా కానీ ఏదో ఒక అఫైర్‌ స్టార్ట్‌ చేస్తుంది. కానీ తాప్సీ సినీ రంగానికి వచ్చి అయిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి సీరియస్‌ అఫైర్లు పెట్టుకోలేదు. ఆమె పేరుతో లింక్‌ అయిన గాసిప్స్‌ ఏమీ వినిపించలేదు. కెరియర్‌ పరంగా దృష్టి పెడుతున్నప్పుడు వేరే వాటికి తావు ఇవ్వలేనని తాప్సీ అంటోంది. దేనికైనా హండ్రెడ్‌ పర్సెంట్‌ కమిట్‌మెంట్‌ ఇవ్వగలిగితే తప్ప దాని గురించి ఆలోచించనని, అందుకే ఇప్పుడు తనకి వేరే ఆలోచనలు లేవని చెప్పింది. రన్నింగ్‌ షాదీ.కామ్‌ అనే హిందీ చిత్రంలో వెడ్డింగ్‌ ప్లానర్‌ పాత్ర పోషిస్తోన్న తాప్సీకి ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఇకపోతే తన పెళ్లిని ఎలా ప్లాన్‌ చేసుకోవాలనే దాంట్లో కూడా తనకి ఓ ఐడియా వుంది. సెలబ్రిటీల పెళ్లిళ్లు చాలా చూస్తున్నానని, ఒకరితో ఒకరు పోటీ పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ఆకాశం, భూమి కలిపేసే లెవల్లో ఖర్చు పెడుతున్నారని, తనకి అలాంటి హంగులు, ఆర్భాటాలు నచ్చవని.. ఎప్పుడు చేసుకుంటాననేది ఇంకా తెలియకపోయినా కానీ తన పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా జరుగుతుందని చెప్పింది. పెళ్లి కోసం ఖర్చు పెట్టే అన్ని కోట్లు ఒక్క రాత్రిలో కరిగిపోతాయని, తర్వాత దాని గురించి కూడా మర్చిపోతారని, అందుకోసం అంత ఖర్చు పెట్టడం కంటే దానిని సాటి వారికి సాయపడేందుకు వాడితే బాగుంటుందని తన గొప్ప ఆలోచనలు చాటుకుంటూ, మిగతావారికి కూడా హితోపదేశం చేస్తోంది. కీపిటప్‌ తాప్సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు