రాధికని బాగా ఇబ్బంది పెట్టాడట

రాధికని బాగా ఇబ్బంది పెట్టాడట

ఎలాంటి పాత్రనిచ్చినా కానీ అందులో పరకాయ ప్రవేశం చేసేసి జీవం పోసేస్తున్నాడు నవాజుద్దీన్‌ సిద్ధికీ. ఆఫ్‌బీట్‌ సినిమాలతో మొదలుపెట్టి ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా రెగ్యులర్‌ ఫీచర్‌ అయిపోయిన నవాజుద్దీన్‌కి వున్న పాపులారిటీ గుర్తించి అతడినే హీరోగా పెట్టి మాంజి అనే సినిమా తీస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్‌ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. ఈ తరహా ప్యారలల్‌ సినిమాల్లో తరచుగా కనిపిస్తోన్న రాధిక బోల్డ్‌ సీన్స్‌ చేయడానికి కూడా ఏమాత్రం జంకదని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అయితే తాను ఇంతవరకు నటించిన హీరోలకీ నవాజుద్దీన్‌కీ చాలా తేడా వుందని, తనతో రొమాంటిక్‌ సీన్‌ చేయాల్సి వచ్చినా కానీ అస్సలు మాట్లాడకుండా ఒక పక్కన కూర్చునే వాడని, రొమాంటిక్‌ సీన్స్‌ చేసే ముందు ఆర్టిస్టుల మధ్య స్నేహ సంబంధాలు బాగా అవసరమని, కానీ నవాజుద్దీన్‌ మాత్రం తనంటే అస్సలు పడనట్టు ఎటో చూస్తుండేవాడని, సీన్‌ మొదలు కాగానే వెంటనే దానికి తగ్గట్టు నటించేసే వాడని, కానీ తాను ఉన్నపళంగా అతడితో ఫ్రీగా నటించలేకపోయేదాన్నని అతను పెట్టిన ఇబ్బందిని గురించి ఏకరువు పెట్టింది.

అయితే నవాజుద్దీన్‌ సిద్ధికీ మాత్రం రాధికతో నటించడం ఎంజాయ్‌ చేశానని, తనకి సీన్‌ లేకపోయినా కానీ సెట్‌కి పిలవమని దర్శకుడితో చెప్పేవాడినని, అలాంటి హీరోయిన్‌ సెట్లో వుంటే కొండలు కొట్టడం కష్టం కాదని నవ్వుతున్నాడు. ఇందులో ప్రేమకోసం ఒక కొండని తవ్వేసే ప్రేమికుడిగా నవాజుద్దీన్‌ సిద్ధికీ నటిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు