బాహుబలి ముందు చిన్నబోయిన భాయ్‌

బాహుబలి ముందు చిన్నబోయిన భాయ్‌

బాహుబలి చిత్రం తొలి రోజున ఇండియాలో నలభై రెండు కోట్ల నెట్‌ కలెక్షన్లు సాధించి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తే, ఇది కేవలం మూడు నాళ్ల ముచ్చటేనని, బజరంగి భాయ్‌జాన్‌ వచ్చి లెక్క సరిచేస్తాడని అనుకున్నారు. కానీ సల్మాన్‌ఖాన్‌ సినిమా కేవలం ఇరవై ఏడు కోట్ల నెట్‌ వసూళ్లు సాధించి బాహుబలి ముందు చిన్నబోయింది. అయితే రంజాన్‌కి ముందు హిందీ సినిమా వసూళ్లు డల్‌గా వుండడమనేది తెలిసిన సంగతే. గత ఏడాది రంజాన్‌కి విడుదలైన కిక్‌ అయితే బజరంగి కంటే తక్కువ ఓపెనింగ్‌ తెచ్చుకుంది.

కానీ అంతిమంగా రెండు వందల కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. కాబట్టి బజరంగి భాయ్‌జాన్‌ కూడా శనివారం నుంచి సోమవారం వరకు బాక్సాఫీస్‌ని చెడుగుడు ఆడేసుకుంటుందని అంచనాలున్నాయి. ఇదిలావుంటే హిందీలో బాహుబలి యాభై కోట్లకి పైగా నెట్‌ వసూళ్లు సాధించి ఇంకా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది. హిందీలో ఈ చిత్రం యాభై కోట్ల వసూళ్లు సాధిస్తే చాలా గ్రేట్‌ అని విడుదలకి ముందు విశ్లేషకులు పేర్కొన్నారు. బాహుబలి ఆ ఫీట్‌ సాధించి ఇంతవరకు ఏ దక్షిణాది అనువాద చిత్రం సాధించని ఘనత దక్కించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు