బాహుబలి: కర్నాటకలో సింగిల్‌ డేలో అవుట్‌

బాహుబలి: కర్నాటకలో సింగిల్‌ డేలో అవుట్‌

కర్నాటకలో బాహుబలి చిత్రాన్ని అన్ని వర్షన్లకీ కలిపి పన్నెండు కోట్లకి కొంటే చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. మగధీర మినహా కర్నాటకలో తెలుగు సినిమాల మార్కెట్‌ అయిదు కోట్ల స్థాయిలోనే వుంది. మరి దీనిపై ఇంత నమ్మకమేంటని అనుకున్నారు. బాహుబలి ఏంటనేది తొలి రోజునే ఆన్సర్‌ దొరికేసింది. బాహుబలి తెలుగు వర్షన్‌ ఒక్కటే మొదటి రోజున కర్నాటకలో ఎనిమిది కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టుకుంది. తెలుగు సినిమాల పేరిట వున్న మొదటి వారం రికార్డుని ఒక్క రోజులోనే బ్రేక్‌ చేసేసింది. ఒక్క బెంగళూరులోనే మొదటి రోజున రెండు లక్షల పది వేల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఈ ప్రభజంనం చూస్తుంటే కర్నాటకలో బాహుబలి తెలుగు వర్షన్‌కే పన్నెండు నుంచి పదిహేను కోట్ల షేర్‌ వస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్‌లో మరీ ఈ స్థాయిలో ఉధృతి లేకపోయినా కానీ అనువాద చిత్రాలని చూసేందుకు ఆసక్తి చూపించని నార్త్‌ ఇండియాలో కూడా బాహుబలి కొత్త రికార్డులు నెలకొల్పింది. తమిళనాడులో తెలుగు, తమిళ వెర్షన్లకి మొదటి రోజున అయిదు కోట్లకి పైగా గ్రాస్‌ వసూలయింది. పెద్ద తమిళ చిత్రాల స్థాయి వసూళ్లట ఇవి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు