అమ్మడు ఆన్‌ టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌

 అమ్మడు ఆన్‌ టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌

రాక రాక అమెరికా రమ్మని ఓ ఆహ్వానం.. దిగినప్పటినుండి రెడ్‌ కార్పెట్‌లో స్వాగతాలు.. ఫైవ్‌స్టార్‌ ట్రీట్‌మెంట్‌.. వచ్చినందుకు రెమ్యునరేషన్‌.. అదిరిపోయే ఆతిథ్యం.. ఇంకేం కావాలి ఢిల్లీ భామ తాప్సీకి? అమెరికాలోని తెలుగు ఎన్నారైల ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న ఈ రింగుల జుత్తు గంగ అక్కడ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోందట.

ఓ నాలుగు రోజుల పాటు తెలుగువారికి సంబంధించి వివిధ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న సుందరి ఇప్పుడు హ్యాపీగా షాపింగ్‌ చేస్తూ అమెరికా అంతా చుట్టేస్తోంది. మ్యాప్‌లో అమెరికాపై అటు నుండి ఇటు తిరుగుతూ రచ్చ చేస్తున్నా అంటోంది. అదిగో ఆన్‌ టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఫీలింగ్‌ వచ్చేసింది అంటూ అమ్మడు తన ఎక్సయిట్‌మెంట్‌ను వెల్లడించింది. బాగానే ఉందమ్మా.. ఇంతకీ తెలుగు సినిమాలేం చేస్తున్నావ్‌? గంగ సినిమా హిట్టయ్యింది కాని, గ్లామర్‌ రోల్స్‌ చేయడం ఇష్టం లేక అమ్మడు మరో కాజల్‌ టైపులో టాలీవుడ్‌ను పక్కనెట్టేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు