మహేష్‌బాబు ముసుగు పన్జేసింది

మహేష్‌బాబు ముసుగు పన్జేసింది

ఈవారం విడుదలైన సినిమాలు ఏడెనిమిది వరకు వున్నాయి కానీ వేటికీ ప్రేక్షకాదరణ లేదు. వున్నంతలో 'సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌' ఒకటే ఫర్వాలేదనే వసూళ్లు రాబట్టుకుంటోంది. మహేష్‌బాబుని కిడ్నాప్‌ చేసే ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో కొందరు యువ హీరోలు గెస్ట్‌ క్యారెక్టర్లు చేశారు. అయితే పోస్టర్లపై మహేష్‌బాబు మాస్క్‌లు, టైటిలు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఈమాత్రం వసూళ్లు వస్తున్నాయంటే గ్రేటే. పబ్లిసిటీ పరంగా కూడా పెద్దగా ఖర్చు పెట్టకపోయినా కానీ మహేష్‌ ఫ్యాక్టర్‌ కలిసి వచ్చింది.

ఈచిత్రం ఏమాత్రం వసూళ్లు తెచ్చుకున్నా కానీ ఆ క్రెడిట్‌ మహేష్‌బాబుకే దక్కుతుంది. బాహుబలి చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆ ఫీవర్‌ కనిపించేస్తోంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద జనం తాకిడి బాగా తగ్గింది. శుక్రవారం రాబోతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా వస్తే ఇక మిగిలిన సినిమాలకి వసూళ్లు వుండవని అంతా ప్రిపేర్‌ అయిపోయారు. కానీ అసలు ఆ సినిమా రాకుండానే కలెక్షన్లు లేకపోవడంతో గట్టెక్కిపోదామని అనుకున్న బయ్యర్లు, నిర్మాతలు బిక్కమొహాలు వేశారు.  

 

TAGS

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English