పవన్‌కళ్యాణా.. మజాకా!

పవన్‌కళ్యాణా.. మజాకా!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సినిమా ఇంకా సరిగా సెట్టెక్కనే లేదు. ఇంకా పవర్‌స్టార్‌ సింగిల్‌ డే షూటింగ్‌కి కూడా హాజరు కాలేదు. కానీ గబ్బర్‌సింగ్‌ 2 రైట్స్‌ మొత్తం హోల్‌సేల్‌గా తీసేసుకుంది ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ. తెలుగులో ఈరోస్‌కి పెద్దగా కలిసి రాకపోయినా కానీ 'గబ్బర్‌సింగ్‌ 2' రైట్స్‌ని డెబ్బయ్‌ కోట్లకి తీసుకుని సంచలనం సృష్టించింది. తెలుగు సినీ చరిత్రలో వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ డీల్స్‌ ఇది.

ఇక ఈ చిత్రం పంపిణీతో పాటు శాటిలైట్‌, డివిడి హక్కులన్నీ కూడా ఈరోస్‌కే సొంతం. కార్పొరేట్‌ సంస్థ హక్కులు తీసుకుందంటే ఇక పవన్‌కళ్యాణ్‌ కూడా తీరిగ్గా షూటింగ్‌కి వస్తానంటే కుదర్దు. ఇంకా జిమ్‌లు పట్టుకుని తిరుగుతోన్న పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ గెటప్‌కి కూడా ఇంకా మారలేదు. ఈరోస్‌ చేతిలోకి సినిమా వెళ్లింది కాబట్టి ఇక ఈ చిత్రం షూటింగ్‌ నిరాటంకంగా జరుగుతుంది. ముందుగా జనవరిలో విడుదల చేద్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు సమ్మర్‌ని టార్గెట్‌ చేసే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు