డిజాస్టర్‌ కా బాప్‌!

డిజాస్టర్‌ కా బాప్‌!

బాలీవుడ్‌లో రెండొందల కోట్ల విజయాలు లేకుండానే ఈ ఏడాదిలో ప్రథమార్థం గడిచిపోయింది. త్వరలో విడుదల కానున్న సల్మాన్‌ ఖాన్‌ సినిమా బజరంగి భాయ్‌జాన్‌ ఆ లోటు తీరుస్తుందని అనుకుంటున్నారు. 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌', 'పీకూ', 'ఏబీసిడి 2' వంటి హిట్‌ సినిమాలతో బాక్సాఫీస్‌కి కాస్త ఉపశమనం దక్కింది. అయితే ఈ ఆరు నెలల్లో కొన్ని దారుణమైన ఫ్లాప్‌లు కూడా వచ్చి బాక్సాఫీస్‌ని కుదిపేసాయి. వాటిలో రెండు భారీ డిజాస్టర్లు ఒకే హీరోవి కావడం గమనార్హం.

రణ్‌భీర్‌ కపూర్‌ నటించిన 'బాంబే వెల్వెట్‌' చిత్రం ఈ ఏడాదిలోనే కాదు బాలీవుడ్‌ చరిత్రలోనే బిగ్‌ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అతను నటించిన మరో చిత్రం 'రాయ్‌' కూడా పెద్ద ఫ్లాపే. సన్నీ లియోన్‌ చిన్నెలు ఇక చెల్లడం లేదు. ఆమె నటించిన రెండు చిత్రాలు మట్టి కరిచాయి. ఎన్‌హెచ్‌ 10, బద్‌లాపూర్‌, దమ్‌ లగాకే హైషా, హంటర్‌లాంటి చిన్న చిత్రాలు విజయం సాధించి.. లో బడ్జెట్‌ సినిమాలకి కూడా మంచి మార్కెట్‌ వుందని నిరూపించాయి. అయితే బాలీవుడ్‌లో అసలు ధమాకా మాత్రం సెకండాఫ్‌లోనే వుంటుంది. కొన్ని పేద్ద సినిమాలు అదృష్టం పరీక్షించుకోవడానికి క్యూ కట్టి కూర్చున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు